: సుదూర గ్రహాలను కచ్చితంగా చూపించే సరికొత్త కెమెరా


అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ సరికొత్త కెమెరాను రూపొందించింది. దీనిపేరు నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్‌ కెమెరా (నియోకాం). విశ్వంలో సుదూరాన ఉండే తరహా ఉష్ణోగ్రత పీడన పరిస్థితుల్లో కూడా ఈ కెమెరా పనిచేస్తుంది. అయితే గ్రహశకలాలను, తోకచుక్కల గమనాన్ని నిర్ణయించడంలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నారు. సాధారణంగా ఆప్టికల్‌ టెలిస్కోపుల్లో చూసినప్పుడు కొన్ని గ్రహశకలాలకు సంబంధించిన డేటా తప్పుదోవ పట్టించేలా ఉండొచ్చు.

అయితే, పరారుణ సెన్సర్ల ద్వారా పనిచేసే ఈ నియోకాంతో ఆ ఇబ్బంది ఉండదు. గ్రహశకలం పరిమాణాన్ని కచ్చితంగా గుర్తించడంతో పాటూ.. అది ఏ పదార్థంతో తయారైందో కూడా అవి తేల్చగలవు. భవిష్యత్తులో అంతరిక్షంలోని కొన్ని గ్రహశకలాలను ఒడిసిపట్టి... మరో ప్రాంతంలోకి తీసుకువచ్చి.. భవిష్య పరిశోధనల్ని కొనసాగించాలని అనుకుంటున్న నాసా పరిశోధనలకు ఈ నియోకాం కీలకంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News