: ఎర్రబస్సా? ఎయిర్ బస్సా?... విమానంలో సీట్ల గొడవ
ఎర్రబస్సుల్లో సీట్ల కోసం కొట్టుకుంటున్నట్టు 'ఎయిర్ బస్సు'లో కూడా సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. ఎర్ర బస్సులో అయితే సీట్లు రిజర్వు చేసే అవకాశం లేదు. ఎయిర్ బస్సులో సీట్లు రిజర్వు అవుతున్నా గొడవలు చోటుచేసుకోవడం విశేషం. విమానాల్లో సీట్ల కోసం ప్రయాణికులు గొడవ పడటం.. దానిని భరించలేని సిబ్బంది విమానం దారి మళ్లించడం అమెరికాలో సర్వ సాధారణమైపోయింది. గడచిన వారంలో ఇలాంటి సంఘటనలు మూడు జరిగాయి. తాజాగా న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు బయల్దేరిన విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు సీట్ల కోసం గొడవ పడ్డారు. వెంటనే విమానాన్ని ల్యాండ్ చేయాలంటూ ఓ ప్రయాణికురాలు డిమాండ్ చేసింది. దీంతో ఫైలట్ విమానాన్ని దగ్గరలోని విమానాశ్రయం వైపు మళ్లించాడు. జాక్సన్విల్లె అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దించారు. అనంతరం అధికారులు, పోలీసుల భద్రతతో విమానం ప్రయాణాన్ని కొనసాగించింది.