: కాలిఫోర్నియాలో ప్రముఖ దర్శకుడు బాపు చిత్రపటానికి నివాళులు


అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రీమాంట్ లో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకుడు బాపు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... తెలుగు చలనచిత్ర పరిశ్రమ బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయిందన్నారు. బాపు ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. బాపు కుటుంబ సభ్యులకు వారు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు, బాలాజీ దొప్పలపూడి, రాంబాబు మందడపు, శ్రీనివాసరావు చెరుకూరి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News