: స్వార్ధం కోసం పార్టీ వీడుతారంతే!: బాబు


వ్యక్తిగత ప్రయోజనాల కోసం, స్వార్ధం కోసం నేతలు పార్టీ వీడుతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నుంచి ఒక నేత బయటకు వెళ్తే... వారి స్థానంలో వందమంది నాయకులను తయారు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాలను టీడీపీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ పదవి ఇచ్చినా తెలంగాణ నేతలకే కేటాయిస్తానని బాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News