: రాంగోపాల్ వర్మపై మరో కేసు
ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కోర్టులో మరో కేసు నమోదైంది. హక్కులపై గళమెత్తే న్యాయవాదులే ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయిస్తున్నారు. అభ్యంతరం చెప్పే వ్యక్తులపైనే కామెంట్ చేసే రాంగోపాల్ వర్మ ఏమీ అనలేడు అనే భావంతో దేవుడిపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో చిక్కుల్లో పడ్డారు. దేవుడ్ని ఆడిపోసుకుని తమ మనోభావాలు దెబ్బతీశారని పేర్కొంటూ పలువురు పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తమ మనోభావాలు దెబ్బతీశారని పేర్కొంటూ కరీంనగర్ పట్టణంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదు చేశారు.