: హైదరాబాద్ కామన్ క్యాపిటలే... జాయింట్ క్యాపిటల్ కాదు: ఎంపీ కవిత
రోజువారీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఉండదని కేంద్రం స్పష్టం చేసిందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. హైదరాబాదు కామన్ క్యాపిటలేనని, జాయింట్ క్యాపిటల్ కాదని ఆమె చెప్పారు. ఇక్కడి ప్రభుత్వ రంగ ఆస్తులపై ఆంధ్రకు హక్కులు ఉండవని కవిత తేల్చి చెప్పారు. ఉద్యోగుల విభజన అంశంపై సీఎం కేసీఆర్ లేఖతో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని ఆమె అన్నారు.