: మెట్రో మేయర్ల సదస్సుకు 60 దేశాల ప్రతినిధులు వస్తారు: కేసీఆర్


అక్టోబరులో హైదరాబాదులో నిర్వహించనున్న మెట్రో మేయర్ల సదస్సుకు 60 దేశాల ప్రతినిధులు వస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో మెట్రో మేయర్ల సదస్సుపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సదస్సులో 2 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. మెట్రోమేయర్ల సదస్సుకు 43 దేశాల నుంచి 566 మంది సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News