: ఆర్టీసీ సమ్మె నివారణకు ప్రయత్నాలు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘ నేతలను చర్చలకు ఆహ్వానించింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతున్నారు. కార్మిక సంఘాల డిమాండ్ల పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.