: 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ లు అభ్యంతరం వ్యక్తం చేశారు
ప్రత్యూష్ సిన్హా కమిటీతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీపై సమగ్రంగా చర్చించారు. ఐఏఎస్, ఐపీఎస్ ల పంపిణీపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన 50 మంది అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీపై స్పష్టత రాకపోవడంతో సమావేశం మరోసారి వాయిదా పడింది. మలి సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.