: ‘బెల్టు’ తీస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర
అనధికారికంగా నడుస్తున్న బెల్టు షాపులపై 2,300 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటివరకు 2,197 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా నడిచే బెల్టు షాఫుల నుంచి 8,291 లీటర్ల మద్యం, 2 వేల లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. బెల్టు షాపుల నిరోధానికి 29 స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కొల్లు చెప్పారు. అలాగే ఐదు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు పనిచేస్తున్నాయని కొల్లు రవీంద్ర తెలిపారు.