: 28.2 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్ 103/4


బర్మింగ్ హామ్ లో భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆదిలోనే భువనేశ్వర్ కుమార్ ఓపెనర్లిద్దరినీ పెవిలియన్ బాట పట్టించాడు. కుమార్ బౌలింగ్ లో తొలుత ఓపెనర్ హేల్స్ (6) అవుటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ కుక్ (9) కూడా కుమార్ బౌలింగ్ లో రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే షమి... బాలెన్స్ (7) ను అవుట్ చేయడం ద్వారా ఇంగ్లండ్ ను దెబ్బ తీశాడు. అనంతరం, క్రీజులోకి వచ్చిన మోర్గాన్ (33), రూట్ (38) నిలకడగా ఆడుతూ స్కోరును సెంచరీ దాటించారు. ఈ దశలో జడేజా వేసిన బంతిని మోర్గాన్ బౌండరీ దాటించే ప్రయత్నంలో రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 28.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News