: దిగంబర బాబాను దర్శించుకుని విమర్శలపాలైన మధ్యప్రదేశ్ సీఎం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు భక్తి ఎక్కువే. ఇటీవలే ఆయన తన కుటుంబంతో కలిసి ఓ దిగంబర బాబాను దర్శించుకున్నారు. ఆయనకు వారు రెండు కొబ్బరికాయలు సమర్పించుకున్నారు... అక్కడి ఆచారాలను అనుసరించి. ఈ సందర్భంగా తీయించుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ, దిగంబర బాబా వద్దకు వెళ్ళడమేంటి? అక్కడ ఫొటోలకు పోజులివ్వడమేమిటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పక్షాలైతే దుమ్మెత్తిపోస్తున్నాయి. మరీ ఇంత మూఢభక్తి పనికిరాదని నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే, కొందరు చౌహాన్ చర్యను సమర్థిస్తున్నారు. జైన సన్యాసులు దిగంబరంగానే ఉంటారని, వారిని ఆరాధిస్తే తప్పేమిటని వారు అంటున్నారు.