: ప్రపంచంలో భారత్ లాంటి సమాజం ఎక్కడా లేదు: మోడీ


భారత దేశం లాంటి సమాజాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేమని ప్రధాని మోడీ తెలిపారు. టోక్యో నగరంలో ప్రవాస భారతీయుల విందులో ఆయన మాట్లాడుతూ, ఉన్న దానితో తృప్తి పడే సమాజం మనదేనని అన్నారు. అంత గొప్ప సమాజాన్ని ఎక్కడ చూడగలమని ఆయన అభిప్రాయపడ్డారు. మన హక్కులను సాధించేందుకు రాజీపడని మనం అన్నింటా సంవృద్ధిగా ఉన్నామని ఆయన తెలిపారు. పరిశుభ్రతను సాధించడమే తమ లక్ష్యమని తెలిపిన ఆయన, అది సాధించడం కత్తిమీద సామేనన్నారు. కష్టపడడమే భారతీయుల లక్ష్యమని, అందుకే బానిసలుగా వెళ్లిన మనవారు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారని ఆయన తెలిపారు. మన మహిళలు చిన్న విషయాల్లో ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తుంటారని ఆయన అన్నారు. తక్కువ సమయంలో సరిగ్గా చీర కట్టుకోవడం, తక్కువ సమయంలో రుచికరమైన ఆహారం తయారు చేయడం, ఇలాంటివి చూడడానికి చిన్నవే కానీ చాలా కష్టం అని ఆయన తెలిపారు. భవిష్యత్ లో జపాన్, భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో నమ్మకం సంపాదించడం చాలా కష్టమని పేర్కొన్న ఆయన, జపాన్ నమ్మకాన్ని తాము సంపాదించామని తెలిపారు. ప్రతి రోజూ ఏదో ఒక సందర్భంలో కుటుంబం మొత్తం కలుస్తుందని, అలాంటి సందర్భాల్లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పట్ల పిల్లల్లో అవగాహన కల్పించాలని ఆయన ప్రవాస భారతీయులకు సూచించారు.

  • Loading...

More Telugu News