: వైఎస్సార్ లేని లోటు అనుభవిస్తున్నాం: రఘువీరా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు ప్రతిక్షణం అనుభవిస్తున్నామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాదు ఇందిరా భవన్ లో జరిగిన వైఎస్ ఐదవ వర్థంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిధ్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. వ్యవసాయ రంగాన్ని అమితంగా ప్రేమించిన వ్యక్తి వైఎస్సార్ అని, అందుకే ఆయన రుణమాఫీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞంతో లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని ఆయన గుర్తు చేశారు. వర్గాలకు, పార్టీలకు అతీతంగా ఆయన సంక్షేమ ఫలాలు అందించారని రఘువీరా తెలిపారు.