: భారీ నీటిపారుదల శాఖపై చంద్రబాబు సమీక్ష
హైదరాబాదులో భారీ నీటిపారుదల శాఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల కోసం ప్రయత్నించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పర్యావరణ, అటవీ అనుమతుల పర్యవేక్షణ కోసం సలహా మండలిని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.