: త్వరలో డీజిల్ ధరలు తగ్గే అవకాశం!
త్వరలో డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం సంకేతాలు పంపింది. చమురు ధరలపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, పెట్రోల్ ధరను నియంత్రించామని, ఇప్పుడు తాము డీజిల్ ధరలపై దృష్టిపెట్టామని తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ సర్కారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ తన మంత్రివర్గానికి చేసిన హితోపదేశం వర్కౌవుట్ అవుతున్నట్టే కనిపిస్తోంది.