: సీఎం కేసీఆర్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే తలసాని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ కలిశారు. సోమవారం నాడు కేసీఆర్ సికింద్రాబాదులోని ఐడీహెచ్ కాలనీ సందర్శించినప్పుడు... తలసాని కూడా అక్కడికి వెళ్లారు. కాలనీలో కూలిపోయిన ఇళ్లను కేసీఆర్ పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందే కేసీఆర్ తో ఓసారి భేటీ అయిన తలసాని, ఇవాళ మరోసారి కలవడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తలసాని టీడీపీని వీడి, టీఆర్ఎస్ లో చేరుతారన్న వాదన బలపడుతోంది.