: సెప్టెంబర్ 5 'గురూత్సవ్' కాదు...టీచర్స్ డేనే: ప్రతిపక్షాల దాడితో వెనక్కి తగ్గిన ఎన్డీఏ సర్కార్


సెప్టెంబర్ 5వ తేదీన 'గూరూత్సవ్'గా జరపాలన్న విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినట్టు కనపడుతోంది. సెప్టెంబర్ 5ను టీచర్స్ డే గానే సెలబ్రేట్ చేయనున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. సెప్టెంబర్ 5న గూరూత్సవ్ గా పేర్కొనాలని మానవ వనరుల శాఖ నుంచి స్కూళ్లకు ఆదేశాలు జారీ అయ్యానని గత వారం వార్తలొచ్చాయి. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో తీవ్రవిమర్శలు ఎదురుకావడంతో కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు కనపడుతోంది. సెప్టెంబర్ 5న 'గూరూత్సవ్'గా తాము ప్రకటించలేదని... ఆ రోజును యథావిథిగా ‘టీచర్స్ డే’గానే సెలబ్రేట్ చేస్తామని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. కేవలం తమ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకునే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేశాయని ఆమె ఆరోపించారు. 'గురూత్సవ్' అన్నది కేవలం ఆ రోజు పిల్లలకు పెట్టనున్న వ్యాసరచన అంశం మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు పంపిన సర్క్యులర్ లో తాము ఇదే విషయాన్ని తెలిపామన్నారు. 'గురూత్సవ్' వ్యాసరచన పోటీలో దేశవ్యాప్తంగా లక్షా 30వేల మంది చిన్నారులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News