: మోడీ వ్యాఖ్యలపై మాకు ఇంకా సమాచారం అందలేదు: చైనా ప్రభుత్వం
జపాన్ పర్యటనలో చైనా విస్తరణ కాంక్షపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరోక్షంగా విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై చైనా ఆచితూచి స్పందించింది. మోడీ జపాన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై తమకు ఇంకా సమాచారం అందలేదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి క్విన్ గాంగ్ వ్యాఖ్యానించారు. అయితే, గతంలో మోడీ చైనా పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందే క్రమంలో... భారత్, చైనాలు వ్యూహాత్మక భాగస్వాములని... మానవ జాతి శ్రేయస్సు, వికాసానికి ఇరుగు పొరుగుదేశాల మధ్య సహకారం, సఖ్యత అవసరమని మోడీ గతంలో పేర్కొన్న వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. తాము భారత్ ను ఇంకా మిత్రదేశంగానే చూస్తున్నామని ఆయన వెల్లడించారు.