: ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ ల సీక్రెట్ వెడ్డింగ్


హాలీవుడ్ స్టార్ జంట ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ లు ఫ్రాన్స్ లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆగస్టు 23న దక్షిణ ఫ్రాన్స్ లోని ఓ గ్రామంలో ఉన్న కుటుంబ ఎస్టేట్ లో ఈ పెళ్లి జరిగినట్లు జోలీ, బ్రాడ్ ల అధికారి ప్రతినిధి మీడియాకు వెల్లడించాడు. ఈ వేడుకకు కేవలం వారి ఆరుగురు పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, ఇంకా ఓ ఇరవై మంది సన్నిహితులే హాజరయ్యారని తెలిపాడు. కాగా, వివాహానికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ 'హల్లో', 'పీపుల్' మ్యాగజైన్ లు కవర్ పేజ్ పై తాజాగా ప్రచురించాయి. 2005లో హాలీవుడ్ యాక్షన్ చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్' షూటింగ్ సెట్ లో జోలీ, బ్రాడ్ పిట్ ల మధ్య ప్రేమ చిగురించింది. అప్పటినుంచి సహజీవనం చేస్తున్న వారిద్దరికీ ముగ్గురు పిల్లలు పుట్టారు. అంతకుముందే మరో ముగ్గురిని దత్తత చేసుకున్నారు. తాజాగా భార్యాభర్తలుగా మారారు. అయితే, గతంలో జోలీకి రెండుసార్లు, పిట్ కు ఒకసారి వివాహం అయింది.

  • Loading...

More Telugu News