: మరణశిక్ష ఖైదీల రివ్యూ పిటిషన్లపై విచారణకు సుప్రీం కొత్త నిబంధనలు
మరణశిక్ష పడ్డ ఖైదీలు దాఖలుచేసే రివ్యూ పిటిషన్లు విచారించేందుకు సుప్రీంకోర్టు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బహిరంగ న్యాయస్థానంలో ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్లను విచారిస్తుందని కీలక తీర్పునిచ్చింది. అంతేగాక, తిరస్కరణకు గురయిన పిటిషన్ దారులు మళ్లీ నెలలోపు కొత్త పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసు నిందితుడు యాకుబ్ మెమన్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో, సుప్రీం తాజాగా నిబంధనలలో మార్పులు చేసింది. కాగా, గతంలో పిటిషన్లను ఇద్దరు జడ్జిల ఛాంబర్ విచారించి శిక్ష విధించేది.