: కోల్ కతాలోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం


కోల్ కతా పార్క్ స్ట్రీట్ లోని అతిపెద్ద ఛటర్జీ ఇంటర్నేషనల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 15వ అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో అతికొద్ది మంది మాత్రమే ఉన్నారని, వారిని బయటికి తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News