: నేపాల్ పశుపతినాథ్ దేవాలయానికి మోడీ, చిరంజీవి విరాళాలు
నేపాల్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఐదవ శతాబ్దానికి చెందిన ప్రముఖ పశుపతినాథ్ దేవాలయాన్ని సందర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపిన మోడీ దేవాలయానికి రూ.2 కోట్ల విలువ చేసే 2,500 కేజీల ఎర్రచందనం దుంగలను విరాళంగా ఇచ్చారట. ఇక, తన పుట్టినరోజు సందర్భంగా ఇదే దేవాలయానికి వెళ్లిన నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రత్యేకంగా పూజలు జరిపించారట. అటు, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా తాజాగా దేవాలయాన్ని సందర్శించుకుని రూ.5,100 విరాళంగా సమర్పించారట.