: వంద రోజుల పాలనలో ధరల మాటేంటి? :సోనియా గాంధీ
వంద రోజుల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతంగా పనిచేశారని మెజార్టీ ప్రజలు కీర్తిస్తూ ఉంటే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంతైనా విపక్ష నేత కదా మరి! అందులోనూ తానడిగిన మేరకు లోక్ సభలో ప్రతిపక్ష నేత పదవి ఇవ్వకపోగా, ముందు వరుసలో రెండంటే రెండు సీట్లను మాత్రమే కేటాయించి తమను అవమానపరిచిందని మోడీ సర్కారుపై ఆమె గుర్రుగా ఉన్నారు. సోమవారం తన సొంత నియోజకవర్గం రాయిబరేలీలో పర్యటించిన సందర్భంగా సోనియా, మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని ప్రస్తావించిన సోనియా, ధరలు దిగిరాలేదేమంటూ దెప్పి పొడిచారు. రాయిబరేలీలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన సోనియా, ఈ దఫా ప్రజలతో మమేకమవుతున్నారట.