: బ్లాక్‌మ్యాటర్ రహస్యాలు వెల్లడవుతాయా?
బ్లాక్‌మ్యాటర్ (కృష్ణ పదార్ధం) అనేది ఒకటి ఉందా? లేదా? అనే విషయంలో ప్రపంచ వ్యాప్తంగా భౌతిక శాస్త్రంలో అనేక సందేహాలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ఈ బ్లాక్‌మ్యాటర్‌కు చెందినదిగా భావించే ఒక కణాన్ని పరిశోధకులు గుర్తించారు. దీని నుంచి సాగించే పరిశోధనల వలన బ్లాక్‌మ్యాటర్ విషయంలో ఉండే సందేహాలు నివృత్తి అవుతాయని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ సూపర్ క్రయోజనిక్ కృష్ణపదార్థ అన్వేషణ అనే ప్రాజెక్టులో ఈ కణాన్ని కనుగొనడం జరిగింది. భారత సంతతికి చెందిన రూపక్ మహాపాత్ర అనే యువ శాస్త్రవేత్త కూడా ఈ బృందంలో ఉండడం విశేషం. బ్లాక్‌మ్యాటర్ నిజమే అనడానికి 5 సిగ్మా స్థాయి సంకేతం ఉన్న పదార్థాన్ని కనుక్కోవాలి. అయితే వారు ప్రస్తుతం 3 సిగ్మా స్థాయి పదార్థాన్ని కనుగొన్నారు. మరింత లోతుగా పరిశోధనలు చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని మహాపాత్ర అంటున్నారు.