: మోడీ పేరు మీద కొత్త మొక్క... అభిమానం చాటుకున్న వృక్ష శాస్త్రవేత్త


పుదుచ్చేరికి చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త టి.వెంకటపతి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అరుదైన బహుమతిని ఇచ్చారు. తాను సృష్టించిన ఓ కొత్త మొక్కకు ఆయన మోడీ అని నామకరణం చేశారు. కాసురినా జాతికి చెందిన ఈ మొక్క వంటచెరుకుగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.'మోడీ' మొక్క సుమారు 35 అడుగులు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మొక్క మూడేళ్లలో వంద కిలోలు తూగే కలపను ఇస్తుందని ఆయన అంటున్నారు. ఒక ఎకరంలో ఏడాదికి నాలుగు వేల 'మోడీ' చెట్లు పెంచవచ్చని... తద్వారా రైతులు ఏడాదికి రూ.7లక్షలు సంపాదించవచ్చని ఆయన పేర్కొన్నారు. దీని దుంగలను తగులబెట్టి... బొగ్గుగా విక్రయిస్తే మరింత లాభం పొందవచ్చని ఆయన అంటున్నారు. వృక్షశాస్త్రంపై చేసిన పరిశోధనలకు గాను... వెంకటపతి 2012లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

  • Loading...

More Telugu News