: అరుణ్ జైట్లీకి మైనర్ ఆపరేషన్!


కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. న్యూఢిల్లీలోని సాకేత్ పరిసరాల్లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అరుణ్ జైట్లీ అడ్మిట్ అయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలో చేరిన అరుణ్ జైట్లీకి మైనర్ ఆపరేషన్ జరగనుందని చెప్పిన ఆ వర్గాలు, ఏ కారణంగా ఆపరేషన్ జరగనుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరించాయి. వంద రోజుల క్రితం గద్దెనెక్కిన మోడీ సర్కారులో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది రోజులకే బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గత నెలలో ఆస్పత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా అరుణ్ జైట్లీ కూడా మైనర్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News