: వందరోజుల్లో ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు: మోడీ


వంద రోజుల తన పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ సరికొత్త జవజీవాలతో పరుగులు తీస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ, ఆ దేశ పారిశ్రామిక వేత్తలతో మాట్లాడిన సందర్భంగా తన వంద రోజుల పాలనపై స్పందించారు. పాలనలో తన ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్పష్టమైన ఫలితాలను ఇచ్చాయని మోడీ చెప్పారు. 5-5.4 మధ్య ఉన్న జీడీపీ తాము తీసుకున్న చర్యల కారణంగా ఒకేసారి 5.7 శాతానికి ఎగబాకిందని పేర్కొన్నారు. దీంతో భవిష్యత్తుపై తమ ప్రభుత్వం దేశ ప్రజలకు భరోసానిచ్చిందని స్పష్టం చేశారు. రైల్వేల్లో వంద శాతం, రక్షణ రంగంలో 26 శాతం నుంచి 49 శాతం దాకా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు త్వరలోనే మంచి ఫలితాలు ఇవ్వనున్నాయని తెలిపారు. పెట్టుబడిదారులకు పక్షపాత రహితంగా తమ ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు ఇవ్వనుందని హామీ ఇచ్చారు. పదేళ్ల పాటు దేశంలో చెడు సంస్కృతి రాజ్యమేలిందన్న మోడీ, మన్మోహన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఇకపై ఆ తరహా సంస్కృతి భారత్ లో కనిపించబోదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News