: లవ్ జిహాదీలకు దూరంగా ఉండాలంటే...బాలికలకు మొబైళ్లు ఇవ్వరాదు: ఆగ్రా వైశ్యుల తీర్మానం


ఉత్తరప్రదేశ్ లో లవ్ జిహాదీల బెడద బెంబేలెత్తించేదిగానే ఉంది. దీని నుంచి తమ పిల్లలను కాపాడుకునేందుకు ఆయా వర్గాలు చేయని యత్నం లేదనే చెప్పాలి. ఈ క్రమంలో నిన్నటిదాకా ఆ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన మహిళలు, యువతులపై ఆంక్షలు తాజాగా పట్టణాలు, నగరాలకూ పాకాయి. లవ్ జిహాదీల గాలి సోకకుండా ఉండేందుకు బాలికలు, యువతులకు సెల్ ఫోన్ లు ఇవ్వరాదని ఆగ్రా వైశ్యులు తీర్మానించారు. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రత్యేకంగా భేటీ అయిన ఈ సామాజిక వర్గానికి చెందిన బడా వ్యాపారులు సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. అది కూడా సాక్షాత్తు కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి కల్ రాజ్ మిశ్రా సమక్షంలో సుమా. భేటీ సందర్భంగా బాలికలు, టీనేజీ యువతుల రక్షణపై అఖిలేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైశ్య ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే రక్షణ కల్పిస్తున్న అఖిలేశ్ సర్కారు మిగిలిన వర్గాల వైపు అసలు దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ఈ కారణంగానే తమను తాము రక్షించుకునేందుకు సొంత నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదని కూడా ఈ భేటీ తమ చర్యలను సమర్ధించుకుంది. 12వ తరగతి లోపు విద్యనభ్యసించే బాలికలకు ఇకపై సెల్ ఫోన్ లను ఇవ్వరాదని తీర్మానించినట్లు అఖిల భారతీయ వైశ్య ఏక్తా పరిషత్ జాతీయ అధ్యక్షుడు సుమంత్ గుప్తా చెప్పారు. మొబైళ్లతో పాటు ఇంటర్నెట్ యువతను నాశనం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని తమ పిల్లలు అర్థం చేసుకునేలా ఒప్పిస్తామని చెప్పిన ఆయన, లవ్ జిహాదీల నుంచి రక్షణ కోసం తమ బాలికలకు కరాటేను కూడా నేర్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News