: ఏపీ రాజధానిగా మంగళగిరి ఫస్ట్ ఛాయిస్... సెకండ్ ఆప్షన్ నూజివీడు
రైతులు ముందుకు వస్తే విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్న మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఒకవేళ మంగళగిరి ప్రాంతంలో రైతులు భూములు ఇవ్వడానికి ముందుకురాకపోతే నూజివీడును సెకండ్ ఆప్షన్ గా తీసుకోవాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విజయవాడకు సుమారు 17 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి ఉంది. ఇక విజయవాడ నుంచి నూజివీడుకు మధ్య దూరం సుమారు 42 కిలోమీటర్లు.