: ‘జీవన్ శగున్’ పేరుతో ఎల్ ఐసీ కొత్త పాలసీ


58వ వార్షికోత్సవం సందర్భంగా జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇవాళ కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. ‘జీవన్ శగున్’ పేరుతో విడుదలైన ఈ పాలసీని 8 నుంచి 45 సంవత్సరాల వయస్సున్న వారు తీసుకోవచ్చు. 12 సంవత్సరాల పాటు కొనసాగే ఈ పాలసీలో కనీస బీమా మొత్తాన్ని 60 వేల రూపాయలుగా నిర్ణయించారు. సింగిల్ ప్రీమియం పాలసీ అయిన ఈ పథకంలో పాలసీ తీసుకొన్న ఐదు సంవత్సరాల లోపు మరణం సంభవిస్తే... ప్రీమియం మొత్తానికి 10 రెట్ల మొత్తాన్ని మెచ్యూరిటీ ఎమౌంట్ గా అందజేస్తారు.

  • Loading...

More Telugu News