: అవి ఆంధ్రుల విగ్రహాలు కాదు, తెలుగువారి విగ్రహాలు: నాయిని వ్యాఖ్యలకు శంకర్రావు కౌంటర్


తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జి.శంకర్రావు ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలకు బాగానే మద్దతు లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ట్యాంక్ బండ్ మీద ఉన్న ఆంధ్రుల విగ్రహాలను తొలగించి, వాటి స్థానంలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తామని ప్రకటించారు. దీని మీద శంకర్రావు వెంటనే స్పందించారు. ట్యాంక్ బండ్ మీద వున్న విగ్రహాలు ఆంధ్రులవి కావని, అవి తెలుగువారివని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలుగువారి గౌరవానికి...గొప్పతనానికి నిదర్శనంగా మహనీయుల విగ్రహాలను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను తొలగించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News