: రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదు


వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సంచలన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదు అయింది. బీజేవైఎం కార్యదర్శి గోపాల్ ఫిర్యాదు మేరకు షాహినాబ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదు చేశారు. ఇంతకు ముందే ఆయనపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఫిర్యాదు మేరకు కేసు నమోదైన విషయం తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ‘ఇది గణేశుడి పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా?’ అంటూ రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ ఆయనపై ఇప్పటికే కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News