: ఆర్ఐపై దాడికి దిగిన ఇసుక మాఫియా
విజయనగరం జిల్లాలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. పూసపాటిరేగ మండలంలోని కోనయ్యపాలెం గ్రామంలో అక్రమ ఇసుక రవాణాని అడ్డుకున్న ఆర్ఐపై హత్యాయత్నం చేశారు. ఆర్ఐ మురళీకృష్ణని ట్రాక్టర్ తో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఆర్ఐని చికిత్స నిమిత్తం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది నెలలుగా రెవెన్యూ సిబ్బంది ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో వారు ఆర్ఐపై ఈ దాడికి తెగబడ్డారు.