: 200 చెంచు కుటుంబాలతో కలసి ఖిలా వరంగల్ కోట ప్రాంతాన్ని సందర్శించిన స్పీకర్


కాకతీయుల చారిత్రక కట్టడాలు ఉన్న ఖిలా వరంగల్ కోట ప్రాంతాన్ని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి సోమవారం నాడు సందర్శించారు. స్పీకరుతో పాటు 200 చెంచు కుటుంబాల వారు కూడా ఉన్నారు. పట్టణ నాగరికత, అక్కడి ప్రజల జీవనం చెంచులకు పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు స్పీకర్ చెప్పారు. సమాజానికి దూరంగా జీవనం సాగిస్తున్న చెంచు కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మూడేళ్ల క్రితం పల్లె నిద్ర కార్యక్రమం సందర్భంగా ఆయన చెంచు కుటుంబాలతో కలసి గడిపారు. అప్పుడు వారి జీవన పరిస్థితులను చూసి చలించిపోయిన మధుసూదనాచారి ... చెంచులకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News