: టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఈరోజు వివిధ పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్ లో ఆ పార్టీ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన వైరా ఎమ్మెల్యే మదన్ లాల్, కాంగ్రెస్ ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అదే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు వెంకట్రావు, రాజేశ్వర్ రావు, యాదవరెడ్డి కారెక్కారు.