: ‘హరితహారం’ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు
‘హరితహారం’ పథకం అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ పథకం కింద వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొక్కలు నాటే ప్రాంతాలు, నర్సరీలను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించారు. మొక్కలు నాటేందుకు రాష్ట్రంలో 3,699 నర్సరీలను గుర్తించారు.