: ఈ కుక్క ఎవరిదో చెప్పండంటూ ట్విట్టర్లో తమన్నా పోస్టు


సినిమా స్టార్లు ఎంత బిజీగా ఉంటారో తెలియంది కాదు. ఎప్పుడూ పని ఒత్తిడితో బిజీగా ఉండే తారలు ప్రైవేట్ లైఫ్ కు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఇతరుల విషయాలు పట్టించుకునే తీరిక వారికెక్కడుంటుంది? అయితే, మిల్కీ బ్యూటీ తమన్నా ఇందుకు మినహాయింపు. విషయం ఏమిటంటే... ముంబై శివారు ప్రాంతం సౌత్ ఖార్ బాగా రద్దీగా ఉంటుంది. ఆ ఏరియాలో ప్రయాణిస్తున్న తమన్నా కు కోకర్ స్పానియల్ జాతి కుక్క ఒకటి రోడ్డుపై కనిపించింది. అది ఓ తప్పిపోయిన పెంపుడు కుక్క అని అర్థం చేసుకున్న ఆమె వెంటనే దాన్ని ఇంటికి తీసుకువచ్చింది. ఇప్పుడు దాని యజమానిని గుర్తించే పనిలో పడిందీ అందాల తార. ఈ మేరకు కుక్క ఫొటోను ట్విట్టర్ లో పెట్టి, ఈ శునకం యజమాని సంప్రదించాలంటూ ఓ ఫోన్ నెంబర్ ను ఇచ్చింది.

  • Loading...

More Telugu News