: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి సాయికృష్ణ మృతి


అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న హైదరాబాదు విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. హైదరాబాదులోని రామంతాపూర్ కు చెందిన సాయికృష్ణ బోస్టన్ వర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ స్మిమ్మింగ్ పూల్ లో పడి సాయికృష్ణ మరణించినట్లు సమాచారం అందింది. అతని మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. సాయికృష్ణ మృతదేహాన్ని త్వరితగతిన భారత్ కు రప్పించేందుకు సాయం చేయాలని భారత్ ఎంబసీకి వారు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News