: రమణ పోయాక మూగబోతే, బాపు పోయాక అవిటిదైపోయింది: బాలు


తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగిన దర్శకుడు బాపు మృతి చెందడం పట్ల గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విచారం వ్యక్తం చేశారు. చెన్నైలోని బాపు నివాసంలో ఆయన భౌతికకాయానికి బాలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలు మీడియాతో మాట్లాడుతూ... బాపు మరణించలేదని, ఆయన మిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణ వద్దకే వెళ్ళారని పేర్కొన్నారు. రమణ చనిపోయాక తెలుగుతల్లి మూగబోయిందని, బాపు పోయాక అవిటిదైపోయిందని తెలిపారు. బాపు తెలుగుజాతికి ఓ వరమని బాలు అభిప్రాయపడ్డారు. దేవుళ్ళు అందంగా ఉంటారన్న విషయం బాపు బొమ్మల ద్వారానే తెలుసుకున్నామని, దేవతల బొమ్మలను గీయడంలో ఆయన తర్వాతే మరెవ్వరైనా అని బాలు తెలిపారు.

  • Loading...

More Telugu News