: శ్రీశైలం డ్యాం నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి దేవినేని ఉమ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కో గేటు 10 అడుగుల మేర ఎత్తి 1,12,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అంతకు ముందు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, దేవినేని ఉమ, తెలంగాణలోని అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు డ్యాం వద్ద శ్రీశైలం దేవస్థాన వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ... ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రజలకు తాగు నీరు, సాగునీటిని అందిస్తామని అన్నారు. ఏ ప్రాంతానికి నష్టం జరుగకుండా ఇరు ప్రాంతాల మంత్రులు, ముఖ్య ఇంజినీర్లు చర్చించుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News