: రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మను తగలబెట్టిన భజరంగ్ దళ్ కార్యకర్తలు
హిందువులు విఘ్నాలు కలుగకుండా పూజించే వినాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, నాలుక్కరుచుకున్న సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మపై పలు సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు (సోమవారం) భజరంగ్ దళ్ కార్యకర్తలు హైదరాబాదులోని అబిడ్స్ లో వర్మ దిష్టి బొమ్మను తగలబెట్టారు. మరోవైపు ఆయనపై ఇప్పటికే పలు చోట్ల కేసులు నమోదైన సంగతి తెలిసిందే.