: శ్వేతాబసు గుట్టు ఇలా రట్టు చేశారు!


వ్యభిచారం నేపథ్యంలో నటి శ్వేతాబసు ప్రసాద్ (23) పేరు బయటికి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓ చానల్ స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయింది. తాజాగా, ఆదివారం రాత్రి వ్యభిచారం చేస్తుండగా, ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే, ఏదో సమాచారం అందుకుని దాడి చేసినట్లు కాకుండా, పోలీసులు సైతం టీవీ రిపోర్టర్ల మాదిరి పక్కా ప్రణాళిక అనుసరించారు. విటుల వేషాల్లో వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఉన్న ఓ స్టార్ హోటల్లో ఖరీదైన వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో, పోలీసు అధికారులు ఓ ప్రత్యేక టీంను రంగంలోకి దించారు. వారు విటుల రూపంలో వెళ్ళి శ్వేతాబసు ప్రసాద్ ను కలిశారు. వారు నిజంగానే వ్యభిచరించడానికి వచ్చారని భావించిన ఆమె తన రేటు వివరాలు వెల్లడించింది. ఒక్క రాత్రికి లక్ష రూపాయలంటూ తెలిపింది. ఇంకేముంది, కావాల్సిన సమాచారం లభ్యం కావడంతో నటిని పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు బ్రోకర్ బాలును కూడా వ్యానెక్కించారు.

  • Loading...

More Telugu News