: బొగ్గు కేసులో సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వాదనలు
బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసులో సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కేంద్రం తరఫున న్యాయస్థానంలో అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. రద్దు చేయాలనుకుంటే 218 లైసెన్సులు రద్దు చేయవచ్చన్న అటార్నీ జనరల్... 40 క్షేత్రాల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైందని కోర్టుకు తెలిపారు. వాటిని రద్దు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని ఆయన న్యాయస్థానానికి విన్నవించారు. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరిన అటార్నీ జనరల్... 40 క్షేత్రాలను మినహాయించాలని ‘సుప్రీం’ను కోరారు.