: తేజీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకోండి: ఢిల్లీ కోర్టు
మాజీ సైన్యాధ్యక్షుడు కల్నర్ వీకే సింగ్ కు లంచం ఇవ్వజూపాడన్న అభియోగాలపై తేజీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకోవాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. టట్రా ట్రక్కుల కేసులో ఢిల్లీ కోర్టు విచారణ జరుపుతోంది. 2010లో వీకేసింగ్ కు రూ.14 కోట్లు లంచం ఇవ్వజూపాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తేజీందర్ సింగ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.