: పాక్ లో అధికారిక టీవీ ప్రసారాల పునరుద్ధరణ


పాకిస్థాన్ లో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా ఆందోళనకారులు ఈ ఉదయం ఇస్లామాబాద్ లోని పాక్ అధికారిక టీవీ చానల్ పీటీవీ కార్యాలయంపై దాడి చేయడం తెలిసిందే. దీంతో, చానల్ ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే, అక్కడ భారీగా సైన్యాన్ని, పారామిలిటరీ రేంజర్లను మోహరించడం ద్వారా, సర్కారు పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ప్రస్తుతం పీటీవీ ప్రసారాలను పునరుద్ధరించారు. ఇస్లామాబాద్ వ్యాప్తంగా నిరసనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News