: కోర్టులో లొంగిపోయిన జగ్గారెడ్డి
మెదక్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి ఇవాళ సిద్ధిపేట కెోర్టులో సరెండర్ అయ్యారు. 2010 ఉప ఎన్నికల్లో రెచ్చగొట్టేలా మాట్లాడారని జగ్గారెడ్డిపై కేసు నమోదు అయింది. కెోర్టుకు హాజరు కానందున గత నెల 26న ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో, జగ్గారెడ్డి ఇవాళ కోర్టులో లొంగిపోయారు.