: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అన్యాయంగా భూస్థాపితం చేశారు: కాంగ్రెస్ నేత సర్వే


మెదక్ ఉపఎన్నిక ప్రచారంలో మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అసలు కారణమైన 'తల్లి'ని (సోనియాను ఉద్దేశించి) తెలంగాణ ప్రజలు పూర్తిగా మరిచిపోయారని సర్వే ఆవేదన వ్యక్తం చేశారు. అనేక కష్టనష్టాల కోర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఏర్పాటు చేస్తే... కనీస కృతజ్ఞత లేకుండా ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని ఆరోపించారు. సీమాంధ్రలో పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా... సోనియా తెలంగాణ ఇచ్చారని మెదక్ ఉపఎన్నిక ప్రచారంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా ప్రజలు గుర్తించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News