: బాపు మృతిపై అసెంబ్లీలో జగన్ స్పందన


సుప్రసిద్ధ సినీ దర్శకుడు, చిత్రకారుడు బాపు మృతికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సంతాపం ప్రకటించారు. అసెంబ్లీలో నేడు మాట్లాడుతూ... బాపు గీత, రాత తెలుగుజాతి సంస్కృతిలో భాగమని కొనియాడారు. తెలుగు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు. ఇక, పార్టీ మహిళా విభాగం నేత రోజా మాట్లాడుతూ, బాపు గారి 'శ్రీరామరాజ్యం'లో నటించడం తన అదృష్టమని చెప్పారు. గత కొన్ని రోజులుగా చెన్నై మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాపు, ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News