: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతాబసు ప్రసాద్... కోర్టులో హాజరు
నటి శ్వేతాబసు ప్రసాద్ మరోసారి వ్యభిచారం చేస్తూ బుక్కయిపోయింది. ఇంతకుముందోసారి మీడియాకు చిక్కిన ఈ బెంగాలీ భామ, ఈసారి పోలీసులకు దొరికిపోయింది. ఆదివారం రాత్రి హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. బంజారాహిల్స్ లోని స్టార్ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయడంతో అమ్మడి గుట్టురట్టయింది. ఆమెతో పాటు బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, శ్వేతాబసును పోలీసులు సోమవారం మధ్యాహ్నం ఎర్రమంజిల్ కోర్టులో హాజరుపరిచారు. ఆమెను స్టేట్ హోంకు తరలించాలని న్యాయస్థానం పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. బాలును కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే, మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని పోలీసులు భావిస్తున్నారు.